బ్రిస్బేన్(Brisbane)లో జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపితే భారత్ ఎదుట 275 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 252/9తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమ్ఇండియా.. మరో ఎనిమిది పరుగులు జత చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగుల లీడ్ లభించగా.. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో టాప్, మిడిలార్డర్ విఫలమైంది. మెక్ సీనీ(4), ఖవాజా(8), లబుషేన్(1), మార్ష్(2), హెడ్(17), స్మిత్(4), కేరీ(19 నాటౌట్), కమిన్స్(22) రన్స్ చేశారు. బుమ్రా 3 వికెట్లు తీసుకోగా, సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.