మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ.10 వేల కోట్లు సంపాదించిన వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. పెద్దమనిషి(KCR) సభకు వస్తే మాట్లాడతాం.. ఈ పిల్లలతో ఏం మాట్లాడతామంటూ హరీశ్ ను ఉద్దేశించి అన్నారు. కాళేశ్వరంలో కమీషన్లు, బినామీలతో కమీషన్లు అంటూ మంత్రి ఆరోపించారు. దీనిపై హరీశ్ రావు సైతం అదే రీతిలో స్పందించారు. ఎక్కడెక్కడో డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు అధ్యక్షా.. సభలోనూ కొందరికి టెస్టులు చేయాల్సి ఉంది.. పొద్దున్నే తాగి వచ్చినట్లుగా ఎవరెవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.. అంటూ హరీశ్ రావు ఎదురుదాడి చేశారు.