సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ ను జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ అనుమతులపై ప్రశ్నలు అడిగింది. బీఆర్కే భవన్లో విచారణ నిర్వహించగా.. కేబినెట్ అనుమతులు(Permissions) లేకుండానే జీవోలు వచ్చాయా.. CMOకు రాకుండానే, కేబినెట్ అనుమతి పొందకుండానే, ఫైల్స్ క్లియర్ అయ్యాయా అని అడిగితే.. తెలియదంటూ ఆమె జవాబిచ్చారు.
మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను అంతకుముందు కమిషన్ ప్రశ్నించింది. తాను బాధ్యతలు చేపట్టకముందే కాళేశ్వరం బ్యారేజీలు పూర్తయ్యాయని సోమేశ్ బదులిచ్చారు. విధానపర నిర్ణయాలు తీసుకున్నది KCR, హరీశేనని నిన్న జరిగిన విచారణలో మరో మాజీ CS ఎస్.కె.జోషి తెలిపారు. కేబినెట్లో CM మాటల్ని ఎవరైనా వ్యతిరేకించారా అని అడిగితే.. అలా ప్రశ్నిస్తే తెల్లారే ఆయన మంత్రి పదవి పోతుందని జోషి బదులిచ్చారు.