పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తికి ICC అంగీకారం తెలిపింది. భారత్ ఆడే మ్యాచుల్ని తటస్థ(Neutral) వేదికలపై నిర్వహించాలని నిర్ణయించింది. 2024 నుంచి 2027 వరకు జరిగే ఇరుదేశాల మ్యాచుల్ని తటస్థ వేదికలపైనే జరపనుంది. ఈ మూడేళ్లలో భారత్ ఆతిథ్యమిచ్చే పాక్ మ్యాచులు, పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సిన టీమ్ఇండియా మ్యాచుల్ని ఇరుదేశాల్లో కాకుండా న్యూట్రల్ వేదికల్లోనే నిర్వహిస్తారు.