గత ప్రభుత్వంలో అమలైన వివిధ పథకాలపై ఇప్పటికే విచారణ కమిషన్ లు దర్యాప్తు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మరో అంశం వాటికి జత చేరింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విధివిధానాల(Guidelines)ను మంత్రివర్గం(Cabinet)లో చర్చించి అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ORR టెండర్లపై SIT(స్పెషన్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేస్తున్నామని CM ప్రకటన చేశారు.