ఏడాది కాలంగా పాలక, ప్రధాన ప్రతిపక్షాల మధ్య నెలకొన్న వివాదం తుది అంకానికి చేరింది. KTRపై అవినీతి నిరోధక శాఖ(ACB) కేసులు నమోదు చేయగా.. FIR కాపీని కోర్టుకు పంపించారు. మోసం(Cheating), అధికార దుర్వినియోగం కింద ఆయనపై తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. పీసీ యాక్ట్ ను ప్రివెన్షన్ ఆప్ కరప్షన్ గా పిలుస్తారు. ప్రజాప్రతినిధులు కానీ సీనియర్ అధికారులు కానీ ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడం లేదా మోసాలకు పాల్పడిన ఘటనల్లో ఈ చట్టాన్ని వాడుతుంటారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాగా.. నాంపల్లిలోని ACB కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీని పంపారు.
KTR ఆదేశాల మేరకు నిధుల్ని బదలాయించామని ఇప్పటికే A2 అర్వింద్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టతనిచ్చారు. కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ సెక్రటరీ పర్మిషన్ లేకుండా నిధుల్ని ఎలా తరలించారు.. రూ.10 కోట్లకు మించి ట్రాన్స్ ఫర్ చేసే అధికారాలు లేని HMDA.. రూ.55 కోట్లలో రూ.45 కోట్లను ఎలా బదలాయించిందన్నది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో అదే విధమైన సెక్షన్లను ఫైల్ చేశారు. నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల పాటు శిక్ష పడే అవకాశముంది.