ఫార్ములా ఈ-రేస్ కేసులో తనను అక్రమంగా ఇరికించారని దాన్ని కొట్టివేయాలంటూ మాజీ మంత్రి KTR.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఎదుట మధ్యాహ్నం దీనిపై విచారణ జరిగే అవకాశముంది. ఈ-రేస్ వ్యవహారంలో విదేశీ సంస్థకు భారీగా నిధులు బదలాయించారంటూ KTRను A1గా, సీనియర్ IAS అర్వింద్ కుమార్ ను A2గా ఏసీబీ చేర్చింది.