కేటీఆర్ పై ACB నమోదు చేసిన కేసుపై హైకోర్టులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును క్వాష్ చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్(PP) అభ్యంతరం తెలిపారు. ఇది ACB కేసు కాబట్టి ఈ బెంచ్ పరిధిలోకి ఈ కేసు రాదు అంటూ PPతోపాటు ACB తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే ఇది అత్యవసర పిటిషన్ అయినందున విచారణ చేపట్టాలంటూ KTR లాయర్ అభ్యర్థించారు. దీంతో జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఎదుట విచారణకు వస్తుందని తొలుత భావించారు.
కానీ ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్(CJ) ధర్మాసనం ఎదుట మెన్షన్ చేయాలని జస్టిస్ శ్రవణ్ కుమార్ ఆదేశించారు. దీంతో ఆయన న్యాయవాదులు CJ బెంచ్ లో ఈ విషయాన్ని మెన్షన్ చేయడంతో.. జ్యుడీషియల్ రిజిస్ట్రీకి దాని నోట్ అందించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. దీనిపై రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్న తర్వాత KTR అత్యవసర పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. లంచ్ మోషన్ పిటిషన్ కావడంతో భోజన విరామం తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.