ఈ మధ్యే విడుదలై బాగా ఆడిన ‘లక్కీభాస్కర్’ సినిమా(Movie) టాపిక్ అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వేల మంది భూహక్కులు కోల్పోయినా ప్రస్తుత సర్కారు పట్టించుకోవడం లేదంటూ BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. ఈ రెండు పార్టీల్ని ఒకే గాటన కడుతూ ‘లక్కీభాస్కర్’ సినిమా టాపిక్ ను ఎగ్జాంపుల్ గా చూపారు. అందులో హీరో కుమారుడు స్కూల్ నుంచి సగం చాక్లెట్ తో ఇంటికి వస్తాడు.. అప్పుడా పిల్లాడి తల్లి సగం చాక్లెట్ ఎక్కణ్నుంచి వచ్చిందని అడిగి బ్యాగు నుంచి చాక్లెట్ దొంగిలించిన విషయాన్ని తెలుసుకుంటుంది.. ఈ విషయం టీచర్ కు ఎందుకు చెప్పలేదని పిల్లాణ్ని అడిగితే సార్ కు చెబితే ఏమొస్తది.. చెప్పలేదు కాబట్టే సగం చాక్లెట్ వచ్చిందంటూ జవాబిస్తాడు. అంటే ఇద్దరూ కలిసి చేసిన పనికి చెరి సగం చాక్లెట్ పంచుకున్నారన్నమాట. ఇదే అంశాన్ని కాంగ్రెస్-బీఆర్ఎస్ కు అన్వయిస్తూ రెండు పార్టీలు ఒకటే అన్న రీతిలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.