దేశంలో అత్యధికులు ఉపయోగించే OTT ప్లాట్ ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ముందువరుసలో ఉంటుంది. OTT ప్రయోజనాలతోపాటు షాపింగ్ బెనిఫిట్స్ కూడా దొరుకుతుండటంతో చాలా మంది సబ్ స్క్రిప్షన్ చేసుకుంటున్నారు. ఒక అకౌంట్ తీసుకుని దాని ద్వారా ఎక్కువ మంది సేవల్ని పొందే వీలు ఇప్పటిదాకా ఉంది. కానీ ఈ టర్మ్స్ ల్లో మార్పులు తెచ్చింది అమెజాన్ ప్రైమ్. 2025 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. దీన్నిబట్టి జనవరి నుంచే డివైజ్ ల వాడకంపై పరిమితులు విధించనుంది. ప్రస్తుతం ప్రైమ్ యూజర్లు ఐదు డివైజ్ లను ఒకేసారి వాడుకోవచ్చు. ఏ డివైజ్ అన్నది సంబంధం లేకుండా వీడియోలు చూడవచ్చు.
కొత్త విధానం ప్రకారం ఐదు డివైజ్ లలో ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా ఒకసారికి రెండు డివైజ్ లలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్(Manage) ఆప్షన్ ద్వారా ఏ డివైజ్ లు వాడతారన్నది సెట్ చేసుకోవచ్చు. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాలని తెలిపింది.ఇందుకు సంబంధించిన వివరాల్ని ఈ మెయిళ్ల ద్వారా యూజర్లు అందుకోబోతున్నారు.