బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో హిందువులపై దాడులు(Attacks) పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా పదవి దిగిపోయాక మైనార్టీలైన హిందువులపై భారీయెత్తున అఘాయిత్యాలు జరిగాయి. బంగ్లా వ్యాప్తంగా ఈ నెల 8 వరకు 2,200 కేసులు నమోదైనట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ అక్టోబరు నెలలోనే పాకిస్థాన్ లో 112 కేసులు ఫైల్ అయ్యాయన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022లో బంగ్లాదేశ్ లో 47, పాక్ లో 241.. 2023లో బంగ్లాదేశ్ లో 302, పాక్ లో 103 దాడుల కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాల్ని మినహాయిస్తే మిగతా ఏ పొరుగు(Neighbour) దేశంలోనూ హిందువులపై దాడులు జరగలేదని తెలిపారు. మైనార్టీల భద్రతపై ఇప్పటికే పాకిస్థాన్ తో మాట్లాడామన్న మంత్రి.. బంగ్లా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామన్నారు.