రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా BRS నేత KTR శాసనసభలో ఆవేశపూరితంగా మాట్లాడారు. ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ తీరును ప్రశ్నిస్తూ అవసరమైతే రాజీనామాకు రెడీ అన్నారు. SLBCకి తొలుత రూ.49 వేల కోట్లు అని, ఆ తర్వాత 40 వేల కోట్లని చెప్పి, మళ్లీ ఆ తర్వాత 31 వేల కోట్లకు తగ్గించి చివరకు బడ్జెట్ కు వచ్చే సరికి రూ.26 వేల కోట్లకు కుదించారన్నారు.. ఇక ఆయన మాటల్లోనే చూస్తే…
‘ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో… కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, పాలేరు పోదామా.. ఎక్కడికి పోదామో వాళ్లిష్టం.. కచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణ మాఫీ జరిగిందని రైతులు చెప్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే మీకిచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్షా.. రుణమాఫీ పావలా శాతం కూడా కాలేదు.. రూ.49,500 కోట్లని చెప్పి ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు కూడా మాఫీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు..’ అంటూ KTR ఛాలెంజ్ చేశారు.