కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల.. రానున్న కొద్ది సంవత్సరాల్లో(Future) కొత్త రూపు సంతరించుకోనుందా అంటే అవుననే అంటున్నాయి TTD వర్గాలు. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు EO జె.శ్యామలారావు ప్రకటించారు. హిల్ టౌన్ ను తీర్థయాత్రలకు రోల్ మోడల్ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో TTD విజన్-2047 పేరుతో డెవలప్మెంట్ చేపట్టబోతున్నది. ‘తుడా’ మాస్టర్ ప్లాన్ లో భాగంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సుమారు 18 ప్రాజెక్టులను చేపట్టేందుకు గాను వివిధ ఏజెన్సీలను ఆహ్వానించామని EO తెలిపారు. స్మార్ట్ పార్కింగ్, కొత్త లింక్ రోడ్లు, సబ్ వేస్, రాంభగీచా బస్టాండ్, బాలాజీ బస్టాండ్, అలిపిరి వద్ద బేస్ క్యాంప్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు అందులో ఉన్నాయి.
లడ్డూ రుచిని మెరుగుపరచడం, నెయ్యి పరీక్షలు చేయడం, ముడి సరుకు క్వాలిటీపై బయటి ల్యాబుల్లో పరిశీలించడం, క్యూలో ఉన్న భక్తులకు నిరంతర అన్నదానం లక్ష్యాలతో కొత్త ప్రాజెక్టు ఉండనుంది. క్యూ లైన్లు, విరాళాల కోసం ప్రత్యేక సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు. తిరుమలలో ఆధ్యాత్మిక, సౌందర్యానుభూతి కల్పించేలా అర్బన్ డిజైన్ ఉంటుందని, కొండపైన గల విశ్రాంతి గృహాలపై దాతల పేర్లకు బదులుగా దైవ నామాలు మాత్రమే ఉండాలని TTD నిర్ణయించింది. యాత్రికుల వసతి, దర్శనం సేవల్ని స్పీడ్ చేసేందుకు మాన్యువల్ కార్యకలాపాలకు బదులు AI చాట్ బాట్ ను పరిచయం చేసే యోచనలో ఉంది.