పుష్ప-2 బెనిఫిట్ షో(Benefit Show) తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయాలు, సినీ పరిశ్రమ మధ్య దూరాన్ని పెంచుతున్నాయని అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ ను ఆదుకునే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతోపాటు పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు. శ్రీతేజ్ తోపాటు ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు(Donations) సేకరించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉండటంతో ఆయన వచ్చాక దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఆయన తిరిగి వచ్చాక CMతో భేటీ విషయం ప్రస్తావించనున్నారు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న ప్రచారాన్ని నిర్మాత నాగవంశీ కొట్టిపడేశారు. శ్రీతేజ్ కుటుంబం కోసం సేకరించే విరాళాలకు స్పందించి అందరూ తలో చేయి వేయాలని నిర్మాతల మండలి కోరింది. ఆ నిర్ణయాల్ని ‘X’లో చేసిన పోస్ట్ ద్వారా తెలియజేశారు.
Related Stories
December 22, 2024