అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజైంది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచులు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించగా.. ఆయా తేదీల్ని ICC విడుదల చేసింది. ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీలో పోటీపడతాయి. భారత్ తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న దుబాయిలో ఆడుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే టోర్నీలో 15 మ్యాచులు జరగనుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా… గ్రూప్-Bలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయిలో జరుగుతుంది. అన్నింటినీ డే-నైట్ పద్ధతిలో నిర్వహిస్తారు.
పూర్తి షెడ్యూల్ ఇలా…
19-02-2025… పాకిస్థాన్ X న్యూజిలాండ్… కరాచీ
20-02-2025… భారత్ X బంగ్లాదేశ్… దుబాయి
21-02-2025… అఫ్గానిస్థాన్ X దక్షిణాఫ్రికా… కరాచీ
22-02-2025… ఆస్ట్రేలియా X ఇంగ్లండ్… లాహోర్
23-02-2025… భారత్ X పాకిస్థాన్… దుబాయి
24-02-2025… బంగ్లాదేశ్ X న్యూజిలాండ్… రావల్పిండి
25-02-2025… ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా… రావల్పిండి
26-02-2025… అఫ్గానిస్థాన్ X ఇంగ్లండ్… లాహోర్
27-02-2025… పాకిస్థాన్ X బంగ్లాదేశ్… రావల్పిండి
28-02-2025… అఫ్గానిస్థాన్ X ఆస్ట్రేలియా… లాహోర్
01-03-2025… దక్షిణాఫ్రికా X ఇంగ్లండ్… కరాచీ
02-03-2025… భారత్ X న్యూజిలాండ్… దుబాయి
04-03-2025… సెమీఫైనల్ – 1… దుబాయి
05-03-2025… సెమీఫైనల్ – 2… లాహోర్
09-03-2025… ఫైనల్ లాహోర్… ఒకవేళ భారత్ క్వాలిఫై అయితే దుబాయి
10-03-2025… రిజర్వ్ డే