సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు చలన చిత్ర పరిశ్రమ(Cine Industry) ముందుకొచ్చింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) ఛైర్మన్ దిల్ రాజు అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. అనంతరం హాస్పిటల్లో బాధిత బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించి వివరాల్ని వెల్లడించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు సినీ పరిశ్రమలోనే ఉద్యోగం కల్పిస్తామని, ఈ విషయాన్ని CMకు తెలియజేశామన్నారు. శ్రీతేజ్ కోలుకున్న తర్వాత భాస్కర్ కు ఎలాంటి చోటు కల్పించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకునే బాధ్యత తమదని దిల్ రాజు హామీ ఇచ్చారు.