రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ ‘ఖుషి’. సమంత ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక రీసెంట్గా ‘ఆరాధ్య’ సాంగ్ రివీల్ చేశారు మేకర్స్. ఇది కొత్తగా వివాహమైన జంట అందమైన హ్యాపీ లైఫ్ గురించి పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట గురించి విజయ్ దేవరకొండ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే తనకు ఇంకా వివాహం కానప్పటికీ ఈ పాటలోని చాలా మూమెంట్స్ తన లైఫ్లోనివే అన్నాడు విజయ్.
రియల్ లైఫ్‌లో తన పెళ్లిని తాను ఎలా ఊహించుకుంటున్నాడో ఆరాధ్య సాంగ్‌లో అదేవిధంగా చూపించినట్లు వెల్లడించాడు. తను పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇక పాట విషయానికొస్తే.. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. నిజానికి వీళ్లిద్దరు కూడా మంచి పెర్ఫార్మర్స్. కాబట్టి ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మ్యారేజ్ తర్వాత భార్యభర్తల లైఫ్‌ను తెరపై ఆవిష్కరించడంలో ఆయన ఎక్స్పర్ట్. ఇప్పటికే ‘నిన్ను కోరి, మజిలీ’ చిత్రాల ద్వారా ఆ విషయాన్ని నిరూపించారు కూడా. ఇక సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘ఖుషి’ చిత్రానికి మలయాళ స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందించారు.