పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకుంది. వెకేషన్ కోసం స్పెయిన్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనన్య, ఆదిత్య ఒక మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొనడానికి సెపరేట్‌గా స్పెయిన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడివిడిగా తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసున్న పిక్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్లో ఆదిత్య రాయ్, అనన్య పాండే.. డీప్ హగ్లో మునిగితేలుతున్న ఫొటో తాజాగా బయటికొచ్చింది. వీరిద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉండగా ఫొటో తీసిన అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. ఆదిత్య, అనన్య డేటింగ్లో ఉన్నారని కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. గతేడాది దీపావళి సందర్భంగా కృతి సనన్ ఇంట్లో వాళ్లిద్దరూ కలిసి కనిపించినప్పటి నుంచి ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇదిలా ఉంటే.. లైగర్ ఫ్లాప్ అయ్యాక అనన్య పాండే ఇటీవలే ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలవగా.. ఇందులో రణవీర్‌తో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఒక సైబర్ క్రైమ్-థ్రిల్లర్ మూవీతో పాటు ఓటీటీలో వెబ్ సిరీస్‌లో నటిస్తోంది అనన్య.