వాలంటీర్లు(Volunteers) వైకాపా సైన్యంలా పనిచేస్తున్నారని, వారు సేకరిస్తున్న డేటా(Data) ఎటు పోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీ వ్యవస్థ బలంగా ఉండగా, సచివాలయ సిస్టమ్ ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. దౌర్జన్యంతో కూడిన క్రిమినల్ రాజ్యం నడుస్తోంది.. ఉపాధి హామీ కూలీల కంటే తక్కువ జీతం తీసుకుంటూ వైకాపా దుర్మార్గాల్లో భాగం కావొద్దంటూ వాలంటీర్లకు స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మీట్ అయ్యారు.
ప్రజారాజ్యం పార్టీని నేషనల్ పార్టీలో కలిపినా తాను వెళ్లలేదన్న పవన్… పదవుల కోసం అవకాశాలు వస్తూనే ఉంటాయని, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం చావనైనా చస్తానని అన్నారు. జగన్ సోదరి పార్టీ పెడుతుంటే సంతోషించాను.. ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెడుతుంటే ఆనందపడ్డాను… కానీ ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తామంటున్నారు.. ఇలాంటివి చూస్తేనే పార్టీ నడపడానికి వేల కోట్లు ఉంటే సరిపోదని.. సైద్ధాంతిక బలం, పట్టుదల ఉండాలని నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ వివరించారు. ప్రజలందరి వ్యక్తిగత రహస్యాలు గ్రామ వాలంటీర్లకు ఎందుకు.. నేను వాలంటీర్లందరినీ అనట్లేదు.. మనం ఇచ్చే సమాచారమే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు బలం.. ఆధార్, ఓటర్, పాన్, క్యాస్ట్(Caste), ఇన్ కం(Income) తదితర వివరాలు వారికెందుకు.. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు వారికి లేదు అంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.