రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్(TGPSC) బుర్రా వెంకటేశం కీలక విషయాల్ని వెల్లడించారు. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని, మార్చి 31 లోపు ఖాళీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ఖాళీల భర్తీ(Recruitments)పై ఏప్రిల్లో నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత 6 నుంచి 8 నెలల్లోపే పోస్టులు భర్తీ చేస్తామని మీడియాతో చిట్ చాట్ లో అన్నారు. ప్రస్తుతం గ్రూప్-3 కీ విడుదల చేస్తుండగా.. మరో రెండ్రోజుల్లో గ్రూప్-2 కీ కూడా విడుదల చేస్తామని సూచనప్రాయంగా తెలిపారు.