AP ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన ఘటనపై TTDతోపాటు యంత్రాంగం తీరును ప్రశ్నించారు. జరిగిన ఘటనపై తాను క్షమాపణలు చెప్పానని, ఈ విషయంలో అధికారులకు TTD బోర్డుకు ఎందుకు నామోషీ అంటూ నిక్కచ్చిగా మాట్లాడారు. ఘటనకు బాధ్యత వహిస్తూ TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సహా పాలకమండలి సభ్యులు, అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పాలన్నారు. యంత్రాంగం తప్పులు చేయడంతో ప్రజలు సంబరాలు చేసుకోలేకపోతున్నారని, ఇష్టమొచ్చినట్లు చేస్తూ కులాల పేరుతో దాక్కుంటే బయటకు ఈడ్చుకొస్తామంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ధర్మంలో భాగంగా 15 ఏళ్లపాటు కలిసే ఉంటామని డిప్యూటీ CM స్పష్టం చేశారు. తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్.. భయపడేవాళ్లు పాలిటిక్స్ లోకి రాకూడదన్నారు. తప్పులు చేసేవాళ్లను కూటమిలో ఎవరూ వెనకేసుకురారన్న ఆయన.. క్రిమినల్స్ కు కులాలు ఉండవంటూ సీరియస్ అయ్యారు.