ఈ నెల 26 నుంచి ఇవ్వబోయే కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్లతో జరిగిన మీటింగ్ లో CM రేవంత్ ఈ విషయాల్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డ్ ఉండేలా ‘వన్ రేషన్ వన్ స్టేట్’ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అర్హుల(Eligibilities) జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లే ఇంఛార్జ్ మంత్రికి అందివ్వాలని, మంత్రి ఆదేశాలతోనే లబ్ధిదారుల జాబితా విడుదల చేయాలని ఆదేశించారు. జనవరి 26 తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక పథకాలు అమలు చేయబోతున్నందున కలెక్టర్లే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దన్న ముఖ్యమంత్రి.. క్షేత్రస్థాయి(Ground Level)కి వెళ్లి వారిని గుర్తించాలన్నారు. ఈ స్కీంలకు సంబంధించి ఈనెల 11 నుంచి 15 లోగా ప్రిపరేషన్ పూర్తి కావాలని కలెక్టర్ల సమావేశంలో CM వివరించారు.