సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులతో టోల్ గేట్లు కిక్కిరిసిపోయాయి. టోల్ గేట్ నుంచి ఒక్కో వాహనం దాటడానికి గంటకు పైగా సమయం పట్టింది. ఇక హైదరాబాద్-విజయవాడ దారిలో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఆ దారిలో గల చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా(Toll Gate)లో 24 గంటల వ్యవధిలో 80 వేలకు పైగా వాహనాలు దాటాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఈ రోజు తెల్లవారు జాము వరకు 80 వేలకు పైగా వాహనాలు టోల్ గేట్ దాటినట్లు రికార్డయింది. అంటే గంటకు ఇంచుమించు మూడున్నర వేల వెహికిల్స్ దాటడం చూస్తేనే ఎంత టైమ్ పట్టిందో అర్థమవుతుంది.