ఖోఖో ప్రపంచ ఛాంపియన్(World Champion)గా భారత్ అవతరించింది. తొలి ఖోఖో మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించి కప్పును ఎగరేసుకుపోయింది. ఫైనల్లో నేపాల్ పై 78-40 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎరేనా స్టేడియంలో ఈనెల 13న ప్రపంచకప్ ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. టాస్ గెలిచిన నేపాల్… భారత్ ను మొదట అటాక్ కు ఆహ్వానించింది. ఇది ఆతిథ్య జట్టుకు వరంగా మారితే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. నేపాల్ ను కంటిన్యూగా ఒత్తిడిలోకి నెడుతూనే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది మన మహిళల టీమ్. చివరి వరకూ దూకుడు కొనసాగిస్తూ మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 13న జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనూ నేపాల్ పై భారత్ 42-37తో విజయం సాధించింది.