మరపురాని మధుర జ్ఞాపకాలను మననం చేసుకుంటూ 34 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు పూర్వ విద్యార్థులు. చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(High School)కు చెందిన 1990-91 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు వేడుక(Alumni) నిర్వహించుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఒక్కచోట చేరి నాటి-నేటి సంగతుల్ని పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు, అధ్యాపకులు సహా వివిధ రంగాల్లో స్థిరపడిన 90 మందికి పైగా ఆనాటి విద్యార్థులు.. మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.