ఈరోజు(జనవరి 21)న ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. గ్రహాల కవాతుగా పిలిచే ‘ప్లానెట్ పరేడ్(Planet Parade)’ ఏర్పడనుండగా.. జీవితకాలంలో ఇలాంటిది అత్యంత అరుదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘ప్లానెట్ పరేడ్’ అంటే సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకదానికొకటి వరుసలో ఉన్నట్లుగా సాక్షాత్కరించే ఘట్టం నేటి నుంచి కొన్ని వారాల పాటు కనువిందు చేస్తుంది. జనవరి 21 నుంచి 31 వరకు గ్రహాల కవాతు(ప్లానెటరీ అలైన్మెంట్) ఉండగా, మార్చి ప్రారంభం నుంచి ఇది తగ్గిపోతుంది. దీన్ని గ్రహసంయోగంగా పిలుస్తుండగా.. టెలిస్కోప్ లేకుండానే ఆరు గ్రహాలైన శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్లను ఏకకాలంలో చూడొచ్చు. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపైనే దృశ్యాల స్పష్టత ఆధారపడి ఉంది. ఈ ‘ప్లానెట్ పరేడ్’ దాదాపు నాలుగు వారాల పాటు ఆకాశంలో కనువిందు చేయనుండగా.. ఎలాంటి టెలిస్కోప్ లేకుండానే చూడవచ్చు.
10 రోజుల తర్వాత మరో గ్రహమైన మెర్క్యురీ సైతం ఇందులో చేరుతుంది. టెలిస్కోప్ సహాయం లేకుండా 4 గ్రహాలను చూసే అవకాశం ఉండగా నెప్ట్యూన్, యురేనస్ కు మాత్రం టెలిస్కోప్ అవసరం. రాత్రి 8:30 గంటల నుంచి ఇది కనిపించనుండగా 11:30 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. భారత్, అమెరికా, మెక్సికో, కెనడా దేశాల ప్రజలు వీక్షించడానికి వీలుంటుంది. తక్కువ కాంతి ఉన్న స్థలాన్ని ఎంచుకుంటే చాలా బాగా కనపడతాయట. ఈ గ్రహాలన్నీ మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా భూకక్ష్య ఆధారంగా ఆ అమరిక జరగనుంది.