రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లక్షల్లో దరఖాస్తులు(Applications) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం గ్రామ, వార్డు సభలు జరగ్గా.. 10 లక్షల 9 వేల 131 అప్లికేషన్లు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గణతంత్ర దినోత్సవం నుంచి లబ్ధిదారులకు స్కీములు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. ఈ రెండ్రోజుల్లో 9,844 గ్రామసభలు నిర్వహించగా ఇవాళ(22న) ఒక్కరోజే గ్రామ, వార్డు సభలు కలిపి 4,663 నిర్వహించినట్లు CS కార్యాలయం తెలిపింది. మరో రెండు రోజుల సమయం ఉన్నందున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి.