బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమై(Failure) విమర్శల పాలైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ చివరకు రంజీల్లోనూ అవస్థలు(Troubles) పడ్డాడు. పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ కేవలం 3 పరుగులకే చాప చుట్టేశాడు. జమ్మూకశ్మీర్ తో మ్యాచులో ఓపెనర్ గా జైస్వాల్ తో కలిసి బరిలోకి దిగిన అతడు తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. BGT సిరీస్ లో పరాజయాల దృష్ట్యా టీమ్ఇండియా ప్లేయర్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న BCCI రూల్లో భాగంగా రోహిత్ ముంబయి తరఫున బరిలోకి దిగాడు. 2015 తర్వాత తొలి రంజీ మ్యాచ్ ఆడుతున్న అతడు.. 19 బంతులకు సింగిల్ డిజిట్ స్కోరు చేసి ఉమర్ నజీర్ మిర్ వేసిన షార్ట్ లెంత్ బాల్ కు ఔటయ్యాడు.
రంజీల్లో విఫలమైన రోహిత్ పై క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. సీనియర్లపై ఆధారపడకుండా ఇక జట్టులో మార్పులు చేయాల్సిన టైమ్ వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. పాకిస్థాన్లో ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్ గా ఉండనున్న ఇతడు.. జమ్మూకశ్మీర్ బౌలర్లు వేసిన బౌన్సర్లకు ఇబ్బందులు పడ్డాడు. టీమ్ఇండియా కెప్టెన్ ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.