
తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి KTR… దిల్లీ లిక్కర్ కేసు నిందితుడికి లీగల్ నోటీసు(Legan notice) పంపారు. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే కఠిన చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. దిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్… గతంలో మంత్రి KTRపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తప్పుడు విషయాలతో కేంద్రంతోపాటు CBIకి ఫిర్యాదు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని, బేషరతుగా ఇచ్చిన కంప్లయింట్ ను వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు.
వీటిపై తగిన రీతిలో రెస్పాండ్ కాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లీగల్ నోటీసు ద్వారా KTR హెచ్చరికలు పంపారు. దేశంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో దిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోదియా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురిని అరెస్టు చేసిన CBI… వారిని జైలుకు పంపించింది. ఈ స్కాం విషయంలో అధికార BRS పార్టీలోని కొందరు టాప్ లీడర్లపై ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన పరువుకు భంగం కలిగించారంటూ KTR లీగల్ నోటీసుల్ని పంపడం చర్చనీయాంశంగా మారింది.