ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా ఇటలీకి చెందిన జేనిక్ సిన్నర్(Jannik Sinner) నిలిచాడు. ఒక్క బ్రేక్ పాయింట్ కోల్పోకుండా ఆల్ రౌండ్ ప్రతిభ(Performance)తో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరోవ్ పై 23 ఏళ్ల సిన్నర్.. వరుస సెట్లలో 6-3, 7-6(4), 6-3తో విజయం సాధించి ఈ గ్రాండ్ స్లామ్ ను రెండోసారి గెలుకుచున్నాడు. అత్యంత చిన్న వయసులోనే కంటిన్యూగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుని 1992-93లో జిమ్ కొరియర్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. 2023 జూన్ 1 నుంచి ఈ చిన్నోడు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకింగ్స్ లో కొనసాగుతుండగా, గత ఐదు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడింటిని కైవసం చేసుకున్నాడు. గత సెప్టెంబరులో అతడు US ఓపెన్ గెలుచుకున్నాడు.