మౌని అమావాస్య సందర్భంగా భక్తజనం(Pilgrims) పోటెత్తడంతో కేవలం నాలుగైదు గంటల్లోనే 1.75 కోట్ల మంది అమృత స్నానాలు(Amrit Snan) పూర్తి చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి పొద్దున 6 గంటల వరకే 1.75 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసుకోగా, ఈ రెండు వారాల్లో 20 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ సందర్శించారు. ఈ విషయాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. మొత్తం 350కి పైగా రైళ్లు నడపగా, వివిధ రవాణా మార్గాల ద్వారా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమృత స్నానం కోసం భక్తులు ఎగబడటంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతోపాటు చెల్లాచెదురు కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ గందరగోళంలో ఏం జరుగుతుందోనన్న భయంతో కిందపడ్డవాళ్ల పైనుంచే భక్తులు పరుగులు తీయడంతో విషాదం ఏర్పడింది. తొక్కిసలాటలో బాధితులుగా మిగిలినవారిలో మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు.