మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్(England)తో సిరీస్ ను భారత్(TeamIndia) సొంతం చేసుకుంది. పుణెలో జరిగిన మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగి.. పాండ్య, దూబె హాఫ్ సెంచరీలతో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్.. 95కే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. కానీ హ్యారీ బ్రూక్(51)కు మిగతావారి నుంచి సపోర్ట్ దక్కలేదు. సాల్ట్(23), డకెట్(39), బట్లర్(2), లివింగ్ స్టోన్(9), బెథెల్(6), కార్సె(0), ఆర్చర్(0) పరుగులు చేశారు. శివమ్ దూబె స్థానంలో కంకషణ్ గా బరిలోకి దిగిన పేస్ బౌలర్ హర్షిత్ రాణా.. 3 వికెట్లు తీసుకుని మలుపు తిప్పాడు. 146కే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను ఓవర్టన్, రషీద్ నిలిపే ప్రయత్నం చేసినా వృథా అయింది. మరో 2 బంతులు మిగిలి ఉండగానే 166కు ఆలౌటై 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ను భారత్ 3-1తో చేజిక్కించుకుంది. తొలి రెండు మ్యాచుల్లో భారత్, మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించాయి.