రేవంత్ రెడ్డి మరో నయీంల తయారయ్యారని BRS సీనియర్(Senior) లీడర్ దాసోజ్ శ్రవణ్ అన్నారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిపై ఆయన పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. 10 మంది పలు నంబర్ల నుంచి కాల్ చేశారంటూ సదర్ కాల్స్ లిస్ట్ ను పోలీసులకు అందజేశారు. రేవంత్ రెడ్డి అభిమానులం(Fans) అని కొంతమంది వ్యక్తులు చెప్పలేని విధంగా దుర్భాషలాడారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైనా గతంలో దాడులు చేశారని గుర్తు చేశారు. చివరకు కాంగ్రెస్ లీడర్లు హనుమంతరావు, జగ్గారెడ్డిలపైనా ఇలాగే వ్యవహరించారని శ్రవణ్ ఫైర్ అయ్యారు.
తన అనుచరులతో కలిసి శ్రవణ్… హైదరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తరచూ బెదిరింపు కాల్స్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కంప్లయింట్ లో కోరారు.