గత ఆరు దశాబ్దాల్లో(Decades) ఎన్నడూ లేని విధంగా హాలీవుడ్ సమ్మె బాట పట్టింది. నటీనటులు, రచయితలు సమ్మె(Strike)కు దిగడంతో షూటింగ్ లన్నీ నిలిచిపోయాయి. వీరికి మెయిన్ యాక్టర్స్ తోపాటు వివిధ సంస్థలు సపోర్ట్ గా ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను క్రమంగా విస్తరిస్తుండటంతోపాటు తమకు తక్కువ జీతాలు ఇస్తున్నారంటూ ఆందోళన బాట పట్టారు. హాలీవుడ్ యాక్టర్స్, రైటర్స్ అంతా లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లో నిరసనకు దిగారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. రెండు నెలలుగా రైటర్స్ పనిచేయకపోవడంతో చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ సమ్మెలో 50,000 మందికి పైగా యాక్టర్స్ పాల్గొంటున్నారు. ఆస్కార్, ఎమ్మీ విజేతలు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నారు. ‘CEOలకు మిలియన్ల కొద్దీ డబ్బు ఇస్తున్నప్పుడు మా విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు.. మేం బాధితులుగా మారాం, మాకు వేరే దారి లేదు.. ఈ ప్రొఫెషన్ లో ఉన్నవారు మాతో వ్యవహరిస్తున్న తీరు బాధకు గురిచేస్తోంది’ అంటూ ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు సినిమాల కంటే ఈ స్ట్రైకే హాలీవుడ్ ను కుదిపేస్తున్నది. సమ్మె కారణంగా భారీ సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కావడానికి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లో ఏంజెలినా జోలి, టామ్ క్రూజ్, మెలిన్ స్ట్రీప్ వంటి టాప్ స్టార్స్ ఉన్నారు. నైట్ షోలు, నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే షోలను వెంటనే ఆపేయాలని రైటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.