కెనడా, మెక్సికో, చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు(Tariffs) విధించడంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం(Trade War) తలెత్తుతుందన్న భయాల నడుమ రూపాయి విలువ మరింత క్షీణించింది. 67 పైసలు తగ్గి డాలర్ తో పోలిస్తే 87.29 వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. విదేశీ నిధుల ప్రవాహం, వివిధ దేశాల మార్కెట్లలో అమెరికన్ కరెన్సీ విస్తృతంగా బలం పుంజుకోవడం వంటి కారణాలతో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న వాణిజ్య భయాలు ఒకవైపు.. US డాలర్ సురక్షితస్థాయికి చేరడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తింది. యూరో 1,022కి, యెన్ 155.54కి పడిపోవడంతో US డాలర్ ఇండెక్స్ 109.77కు పెరిగింది. క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు 0.71 శాతం పెరిగి 76.21 డాలర్లకు చేరుకున్నాయి. రూపాయి క్షీణతపై రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకుంటుందన్న అంచనాలతో ఈ రోజు 86.65 నుంచి 87.00 స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.