రైలు ప్రమాదాల్ని నివారించేందుకు కొత్త విధానం రాబోతోంది. భారతీయ రైల్వే డెవలప్ చేసిన కవచ్ వ్యవస్థను వచ్చే ఏడాది(2026)లోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే 100 వందేభారత్ రైళ్లను తీసుకొస్తున్నామన్నారు.
కవచ్ అంటే…
రెడ్ సిగ్నల్ పడిన టైంలో రైలు ముందుకు వెళ్లకుండా ఉండటం, ఓవర్ స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి ఆటోమేటిగ్గా బ్రేకులు వేయడం వంటివన్నీ ‘కవచ్’లో ఉంటాయి. సమీపంలోని రైళ్లు, ట్రాక్ లతో కమ్యూనికేట్ చేయడానికి హై-ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నళ్లను ఉపయోగించడమే ఈ విధానం ఉద్దేశం. ట్రెయిన్ ప్రమాదాల్ని నిరోధించేందుకు 5 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ఇతర రైళ్లను కవచ్ తో నిలిపివేస్తారు. లోకోపైలెట్లు సిగ్నల్ జంప్ చేసిన సందర్భాల్లోనూ ఎమర్జెన్సీ వార్నింగ్ పంపుతుంటుంది. పొగమంచు వల్ల సరిగా కనిపించకపోయినా, ఒకే ట్రాక్ పై రెండు రైళ్లున్నప్పుడు అలర్ట్ చేస్తూ ట్రాక్ ఐడెంటిఫికేషన్ నంబర్(TIN) సహాయంతో రైళ్లు ఢీకొనకుండా చూస్తుంది. ఒకవేళ లోకోపైలట్ అలర్ట్ గా లేని సమయంలోనూ ఆటోమేటిగ్గా బ్రేకులు పడతాయి.