
డిఫెండింగ్ ఛాంపియన్(champion) నొవాక్ జకోవిచ్(సెర్బియా) వింబుల్డన్ ఫైనల్(Final) లో అడుగుపెట్టాడు. 6-3, 6-4, 6-7 (7-4) తేడాతో ఎనిమిదో సీడ్ సిన్నర్(ఇటలీ)ని ఓడించి ఫైనల్ లో ఆల్కరాస్ తో తలపడబోతున్నాడు. జకోవిచ్ ఆట తీరు ముందు సిన్నర్ తేలిపోయాడు. మరో సెమీస్ లో ఆల్కరాస్ 6-3, 6-3, 6-3తో మూడో సీడ్ మెద్వదేవ్(రష్యా)ను ఓడించాడు. ఆల్కరాస్ సైతం పెద్దగా కష్టపడకుండానే మెద్వదేవ్ పై విజయం సాధించాడు. ఇక ఫైనల్లో ఈ ఇద్దరూ తలపడుతుండటంతో టైటిల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జకోవిచ్ 35 సార్లు గ్రాండ్ స్లామ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అత్యధిక సార్లు ఫైనల్స్ కు చేరుకున్న ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన జకో.. క్రిస్ ఎవర్ట్(34) సార్లను అధిగమించాడు.
ఇక వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ 6:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండుసార్లు వింబుల్డన్ ఫైనల్ చేరిన జాబెర్.. తొలిసారి ఆ ఘనత సాధించిన వొండ్రుసోవా మధ్య తుది పోరు జరుగుతుంది.