జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా S.I. ప్రాణాలు కోల్పోయారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘటన జరిగింది. S.I. శ్వేత ధర్మారం వైపు నుంచి జిల్లా హైడ్ క్వార్టర్ అయిన జగిత్యాల వస్తుండగా ఆమె కారు మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెతోపాటు మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. ఆమె SP కార్యాలయంలోని DCRB(డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో ఆమె వెల్గటూరు, కోరుట్లలో విధులు నిర్వర్తించారు.