ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండగా, ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు ప్రకటించాయి. మెజార్టీ స్థానాల్ని BJP గెలుచుకుంటుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు 10 సంస్థలు అంచనాల్ని ప్రకటిస్తే అందులో మెజార్టీ(7) పోల్స్ కమలం పార్టీకే జై కొట్టాయి. మ్యాట్రిజ్, వీప్రిసైడ్, మైండ్ బ్రింక్ మాత్రం ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. https://justpostnews.com
SEATS : 70
TARGET : 36
సంస్థ | బీజేపీ(BJP) | ఆప్(AAP) | కాంగ్రెస్(INC) |
మ్యాట్రిజ్ | 35-40 | 32-37 | 0-1 |
పీపుల్స్ ఇన్ సైట్ | 40-44 | 25-29 | 0-1 |
జె.వి.సి.పోల్ | 39-45 | 22-31 | 0-2 |
పీపుల్స్ పల్స్ | 51-60 | 10-19 | 0-0 |
చాణక్య స్ట్రాటజీస్ | 39-44 | 25-28 | 2-3 |
డి.వి.రీసెర్చ్ | 36-44 | 26-34 | 0-0 |
పోల్ డైరీ | 42-50 | 18-25 | 0-2 |
పీ-మార్క్ | 39-49 | 21-31 | 0-1 |
వీ ప్రిసైడ్(Wee Preside) | 18-23 | 46-52 | 0-1 |
మైండ్ బ్రింక్ (Mind Brink) | 21-25 | 44-49 | 0-1 |
ఢిల్లీ చరిత్ర ఇదే…
1952లో ఢిల్లీలో సాధారణ ఎన్నికలు జరగ్గా, 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారి అసెంబ్లీ రద్దు అయింది. కానీ 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ రాజధాని ప్రాంతం(NCR)గా ప్రకటించడంతో 1993లో ఎన్నికలు జరిగాయి. 49 స్థానాలతో BJP గెలిచి మదన్ లాల్ ఖురానా CM అయ్యారు. ఆ సమయంలో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. 1998లో కాంగ్రెస్ 52 చోట్ల గెలిచి షీలా దీక్షిత్ ను CM చేసింది. ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా పనిచేశారు. 2003లో 47 స్థానాలతో, 2008లో 43 సీట్లతో కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా షీలా దీక్షితే ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో BJP 31, AAP 28, కాంగ్రెస్ 8 సీట్లు సాధిస్తే హస్తం పార్టీ సపోర్ట్ తో కేజ్రీవాల్ CM అయ్యారు. 2015లో AAP 67 సీట్ల బంపర్ మెజారిటీ సాధించి కేజ్రీవాల్ మరోసారి CM పదవి చేపట్టారు. అప్పుడు BJPకి 3 వస్తే, కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదు. 2020లోనూ ఆప్ 62 సీట్లు ఎగరేసుకుపోతే మిగతా 8 బీజేపీవి. ఇక్కడా కాంగ్రెస్ కు సున్నానే మిగిలింది.