
NDA సమావేశానికి అటెండ్ కావాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. NDAలో భాగస్వాములైన పార్టీల చీఫ్ లకు ఇప్పటికే ఇన్విటేషన్ పంపారు. ఈ నెల 18న దిల్లీలో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ మీటింగ్ కు పవన్ హాజరవుతారని జనసేన పార్టీ హింట్ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల కోసం ప్రజల్ని కలుస్తూ తాము చేపట్టదలచిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. YSRCPని మెయిన్ టార్గెట్ చేసుకుంటూ తాను ఎందుకు పార్టీ స్టార్ట్ చేశానన్నది అన్ని చోట్లా వివరిస్తున్నారు.
బహిరంగ సభల్లో జగన్ అండ్ కో పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు… NDA నుంచి ఇన్విటేషన్ రావడంతో ఆ ప్రోగ్రాంకు హాజరవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.