నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుందని భావిస్తున్న ‘తండేల్’ మూవీ.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా తొలిరోజున రూ.21 కోట్లకు పైగా వసూలు చేసింది. చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ‘తండేల్’కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శనివారం వీకెండ్ కావడంతో మరో రూ.20 కోట్లు వచ్చింది. ఇలా రెండ్రోజుల్లోనే రూ.41 కోట్లు వసూలు చేయడంతో చైతూ కెరీర్లో బిగ్గెస్ ఓపెనింగ్ మూవీగానూ ‘తండేల్’ నిలిచింది.
ఆదివారం నాడు కూడా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశమున్నందున మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్ దాటుతుందన్న అంచనాలున్నాయి. బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తం(Joint)గా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ముందునుంచే మంచి అంచనాలున్నాయి. సాయిపల్లవి నటన, పాటలతో సినిమా బాగుందన్న పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్ లో స్పీడ్ పెరిగింది.