ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అతీశీ మర్లేనా చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కల్కాజిలో BJP నేత రమేశ్ బిధూరిపై గెలిచాక సంబరాలు చేసుకున్న ఆమె.. పార్టీ నాయకులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీనిపై రాజ్యసభ MP స్వాతి మాలివాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకీ డ్యాన్స్… పార్టీ నేతలంతా ఓడిపోయినందుకా, అధికారం కోల్పోయినందుకా అంటూ విమర్శించారు. AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్, నంబర్ టూ మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరవ్ భరద్వాజ్ వంటి నేతలంతా ఓటమి పాలయ్యారు.
అయినా ఆమె డ్యాన్స్ చేయడంతో ‘షేమ్ లెస్(Shameless)’ అంటూ సోషల్ మీడియాలో స్వాతి మాలివాల్ పోస్ట్ చేశారు. ఈమె గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేశారు. కానీ తనపై పార్టీ వ్యక్తి దారుణంగా దాడి చేసినా కేజ్రీవాల్ స్పందించకపోవడంతో BJPలో చేరారు. కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో CM బాధ్యతల్ని అతీశీ చేపట్టారు. అయితే పార్టీ ఓడిపోవడంతో కొద్దిసేపటి క్రితమే ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలిసి తన CM పదవికి రాజీనామా చేశారు.