BJP-AAP తీసుకున్న నిర్ణయాలే ఒకరికి అధికారాన్ని కట్టబెడితే, మరొకరిని దారుణంగా దెబ్బతీశాయి. సిట్టింగ్ లకు సీట్లిచ్చి గెలిపించుకోవడంలో BJP 100% సక్సెస్ అయితే కేజ్రీవాల్ 39%తో ఆగిపోయారు. ఇలా ఉన్న సీట్లన్నీ కోల్పోవడానికి అనాలోచిత నిర్ణయమే కారణమైంది. ఢిల్లీ ఎన్నికల్లో 47 మంది సిట్టింగ్ లు పోటీ చేస్తే 26 మంది ఓడిపోయారు. ఇందులో కమలం పార్టీ ఆరుగురికి సీట్లిస్తే అంతా గెలిచారు. 62 మందిలో 36 మందికి AAP సీట్లిచ్చినా 14 మందే నిలిచారు. మిగతా 22 మంది ఓడిపోవడమే పెద్ద దెబ్బ. సిట్టింగ్ లపై అసంతృప్తి, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంతోనే ఆ పార్టీ తేలిపోయింది.
ఓడిన సిట్టింగ్ ల్లో పార్టీ చీఫ్ కేజ్రీవాల్, నంబర్-2 మనీశ్ సిసోడియా, మంత్రులు సౌరవ్ భరద్వాజ్, రఘువీందర్ షొకీన్, రాఖీ బిర్లా ఉన్నారు. సిసోడియా, బిర్లాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా మార్చకపోవడమే శాపమైంది. 2013లో ఆప్ అధికారంలోకి వచ్చాక అతి తక్కువ సీట్లు(22) సాధించడం ఇదే తొలిసారి. 2013లో 28 సీట్లే వచ్చినా కాంగ్రెస్ మద్దతుతో పీఠమెక్కింది. 70కి గాను 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలిచిన AAP.. ఇప్పుడు 22 సీట్లతో సరిపెట్టుకుంది. 48 స్థానాల్లో బీజేపీ పాగా వేసింది.