అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణానికి విశిష్ట సేవలందించిన ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్రదాస్(85) కన్నుమూశారు. అనారోగ్యంతో ఈనెల 3న లఖ్నవూ(Lucknow) ఆసుపత్రిలో చేరిన ఆయన.. బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు విడిచారు. బాబ్రీమసీదు కూల్చివేత సమయమైన 1992 నుంచి గతేడాది బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సహా ఇప్పటివరకు సత్యేంద్ర దాసే ప్రధాన పూజారి(Priest)గా ఉన్నారు. బాబ్రీమసీదు కూల్చివేతకు 9 నెలల ముందుగానే ఆయన రామాలయ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రధాన పూజారికి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్(SGPGI) హాస్పిటల్లోని న్యూరాలజీ విభాగంలో వైద్యమందించారు.
20 ఏళ్లకే ఆధ్యాత్మిక భావనల్ని ఒంటబట్టించుకున్న ఆచార్య మహంత్ సత్యేంద్రదాస్.. యుక్త వయసులోనే నిర్వాణీ అఖారాలో చేరారు. అయోధ్య పునర్నిర్మాణానికి సంబంధించిన ఆలోచనల్లో అత్యధిక భాగం ఆయనవే. రామాలయాన్ని నిర్మించేటప్పుడు సైతం అందుకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.