కోడిపందేల వ్యవహారంలో BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట(Tholkatta) ఫాంహౌజ్ లో పెద్దయెత్తున కోడిపందేలు జరగ్గా పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 61 మందిని అరెస్టు చేసి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇది BRS MLCకి చెందిన ఫామ్ హౌజ్ కావడంతో అటువైపుగా దృష్టి సారించారు. పెద్ద తలల హస్తం ఉందని భావిస్తున్న పోలీసులు.. ఫాం హౌజ్ యజమాని అయిన MLC శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ ఫాంహౌజ్ ఆయన అధీనంలోనే ఉందా, లేక లీజుకు ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. మాదాపూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఖాకీలు.. ఫాం హౌజ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ నోటీసుల్లో తెలియజేశారు.