సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC) ఉద్యమానికి సిద్ధమైంది. ఇకనుంచి దశలవారీగా పోరాటం చేయాలని TSUTF స్టేట్ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో నిర్ణయించారు. తొలి PRC గడువు ముగిసినా పూర్తిస్థాయిలో అమలు కాలేదని, రెండో PRCని ఏర్పాటు చేయలేదని నాయకులు ఫైర్ అయ్యారు. CPS రద్దు, మధ్యంతర భృతి ప్రకటన, 2003 DSC టీచర్స్, ఇతర శాఖల ఉద్యోగులకు పాత పింఛను వర్తింపుతోపాటు మొత్తం 26 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం, మరో ఐదు డిమాండ్లను కేంద్ర సర్కారు పరిష్కరించాలని యూనియన్ లీడర్లు స్పష్టం చేశారు.
మండలాల నుంచి రాజధాని వరకు
ఇందుకోసం ఈనెల 18, 19 తేదీల్లో మండల స్థాయిలో, ఆగస్టు 12న జిల్లా స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ నిర్ణయించింది. ఆగస్టు 3వ వారంలో రౌండ్ టేబుల్ సమావేశం, సెప్టెంబరు 1న హైదరాబాద్ లో మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు జంగయ్య, చావ రవి, అశోక్ కుమార్, లింగారెడ్డి తదితర యూనియన్ నేతలు వెల్లడించారు.