దక్షిణ భారతదేశం(South India)లో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. అయితే మద్యం తాగే వారి సంఖ్య గతానికి కంటే తగ్గిందని తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య(Family Health) సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి. 2015-16లో తెలంగాణలో 53.8 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 34.9 శాతం మంది పురుషులు మద్యం తాగేవారని వివరించారు. అయితే 2019-21కి వచ్చే సరికి తెలంగాణ 53.8% నుంచి 50 శాతానికి, ఆంధ్రప్రదేశ్ 34.9% నుంచి 31.2 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా చూస్తే ఆల్కహాల్ తాగే మగవారి సంఖ్య గతంలో 29.2% ఉంటే ఇప్పుడది 22.4 శాతానికి తగ్గిపోయింది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ టాప్ పొజిషన్లో ఉన్నట్లు తెలిపారు.