అక్రమ వలసదారుల్ని(Illegal Immigrants) దేశం దాటిస్తున్న అమెరికా విమానాలు.. భారత్ లో అమృత్ సర్ లోనే ఆగుతున్నాయి. ఇలా అక్కడికే రావడానికి కారణమేంటంటూ అనుమానాలతోపాటు వివాదమేర్పడింది. ఢిల్లీ, ముంబయి, గుజరాత్ వంటి రాష్ట్రాలు కాకుండా కేవలం పంజాబ్ లోని అమృత్ సర్(Amritsar)కే ఎందుకంటూ వివాదం జరుగుతోంది. పంజాబ్ లోని AAP సర్కారు ఈ విషయంలో BJPపై విమర్శలు చేస్తోంది. తమ రాష్ట్రాన్ని బద్నాం చేయడానికే విమానాల్ని ఇక్కడకు రప్పిస్తున్నారని భగవంత్ సింగ్ మాన్ సర్కారు అంటోంది. అయితే దీన్ని రాజకీయం చేయడం సరికాదంటూ మోదీ సర్కారు జవాబిస్తోంది. ఇప్పటికే ఒక విమానంలో 104 మంది తిరిగి రాగా.. ఈనెల 15, 16 తేదీల్లో మరో రెండు విమానాలు అక్కడికే రానున్నాయి.