తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జిగా కొత్త వ్యక్తి నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)ను నియమిస్తూ AICC ప్రకటన చేసింది. మీనాక్షితోపాటు మొత్తం 9 మందికి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యతల్ని అప్పగించింది. మధ్యప్రదేశ్ లోని బిర్లాగ్రామ్ నగ్డాకు చెందిన ఆమె.. 2009-2014 వరకు ఒకేసారి MPగా పనిచేశారు. బయోకెమిస్ట్రీలో PG చేశాక NSUIలో చేరి 1999-2002 వరకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2002-2005లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన మీనాక్షిని.. 2008లో AICC సెక్రటరీగా రాహుల్ గాంధీ నియమించారు.