కులగణన కోసం మరోసారి సర్వే చేపట్టనున్న ప్రభుత్వం.. వివరాల నమోదుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 16 నుంచి 28 వరకు వివరాల్ని నమోదు చేయాలనుకునేవారు 040-211 11111 నంబరుకు కాల్ చేయాలని సూచించింది. ఫోన్ చేసినవారి ఇళ్లకు వెళ్లి ఎన్యుమరేటర్లు(Enumerators) డీటెయిల్స్ తీసుకుంటారు. MPDO కార్యాలయాలు, వార్డుల్లోని ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ఈమధ్య జరిగిన కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని ఇంతకుముందే సర్కారు ప్రకటించింది.